గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పవన్‌ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సందర్భంగా ఇవాళ (మంగళవారం) జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా… ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.