పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన తన ప్రచార రథం వారాహి పూజ కోసం కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. ఈ వాహనం నిన్న రాత్రే కొండగట్టుకు చేరుకుంది. ఈ పర్యటన మేరకు జనసేనాని హైదరాబాద్ నుంచి కొండగట్టు బయలుదేరారు. కొండగట్టు బృందావనం రీసార్ట్ వద్ద పవర్ స్టార్ అభిమానుల భారీగా చేరుకుంటున్నారు. వారాహి వాహనంతో అభిమానుల సెల్ఫీలు తీసుకుంటున్నారు.
ఉ.11 గంటలకు పవన్ కొండగట్టు అలయానికి చేరుకుంటారు. ముందుగా అంజన్న స్వామిని దర్శించుకుంటారు. తర్వాత వారాహి ప్రచార రథానికి వాహన పూజ జరిపిస్తారు. అక్కడి నుంచి.2 గంటలకు కొడిమ్యాల (మం) నాచుపల్లి వెళ్లి జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.సాయంత్రం 4.గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అన్స్టాప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) పేరుతో ధర్మపురి క్షేత్రాన్ని దర్శించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడుతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం ధర్మపురి నుంచి హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. సా.5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.