అక్టోబర్ 1న కాలినడకన తిరుమలకు పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..

ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తిరుమలలో ఈ దీక్షను విరమించనున్నారు పవన్. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకోనున్నారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు పవన్ కళ్యాణ్. 

ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అనంతరం అక్టోబర్ 2న తిరుమలలోనే గడపనున్నారు పవన్. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. మంగళవారం ( సెప్టెంబర్ 24, 2024 ) విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. దుర్గ గుడి మెట్లను స్వయంగా శుద్ధి చేశారు పవన్.

Also Read:-వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్