![ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్](https://static.v6velugu.com/uploads/2024/06/pawan-kalyan-took-oath-as-mla-in-ap-assembly_KkaurcSmbX.jpg)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణం చేయిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సీఎం చంద్రబాబు అలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో నిజం గెలిచింది.. ప్రజాస్వౌమ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు . సభలో ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత తదితరులు ప్రమాణం చేశారు. రేపు, డిప్యూటీ ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.