నెల్లూరు జిల్లాలో ఇవాళ పవన్ కల్యాణ్ ప్రచారం

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇవాళ నెల్లూరు జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడ నుంచి బయల్దేరి ఆయన కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటారు. జీపీఆర్‌ కల్యాణమండపం ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. పదిగంటలకు ఈ సభ ప్రారంభం కానుంది.

తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కోవూరులోని పట్టపుపాళెం, స్టవ్ బీడీ కాలనీల్లో సభల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు కావలి దగ్గర్లోని బిట్రగుంట, చెంచులక్ష్మీపురం కూడళ్లలో జనంతో మాట్లాడతారు పవన్ కల్యాణ్.