అపోలో హాస్పిటల్లో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అపోలో హాస్పిటల్లో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ లో చేరారు.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ శనివారం ( ఫిబ్రవరి 23, 2025 ) వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మరికొన్ని టెస్టులు అవసరమని డాక్టర్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరులో కానీ..  మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకోనున్నారని సమాచారం .

ఇదిలా ఉండగా.. సోమవారం ( ఫిబ్రవరి 24 ) నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారని... జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించింది.పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల తమిళనాడు కేరళలోని పుణ్యక్షేత్రాలు సందర్శించి, కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్ నడుం నొప్పి ఎక్కువవడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

ఇటీవలే జ్వరం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని స్పందిస్తున్నారు జనసేన కార్యకర్తలు.