![కాకినాడ ఎమ్మెల్యేకు మహా తిమ్మిరి.. కోన్ కిస్కాగాళ్ల గురించి పట్టించుకోను](https://static.v6velugu.com/uploads/2023/06/Pawan-Kalyan-Varahi-Vijaya-Yatra-at-Kakinada_lLzfR6t7C0.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో దూసుకెళ్తున్నారు. వారాహియాత్ర ద్వారా దూకుడు పెంచిన పవన్.. అధికార వైసీపీపై వరుస పంచులతో విరుచుకుపడుతున్నారు. కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై విరుచుకుపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యేకు మహా తిమ్మిరి ఉందని ఎద్దేవా చేశారు. నేరం చేసిన వాడు ఏ కులం వాడైనా వదలిపెట్టనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు నంబర్ ప్లేటు లేని వాహనాల్లో వచ్చి తనను చంపుతానని బెదిరించారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలు, గూండాలకు చెప్తున్నానంటూ.. కోన్ కిస్కా గాళ్ల గురించి పట్టించుకోనన్నారు. మిమ్ములను వీధుల్లో తరుముకుంటూ తీసుకెళ్తానన్నారు. ఇంకోసారి కులం ప్రస్థావన తీసుకొస్తే మామూలుగా ఉండదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని హెచ్చరించారు.
ఒక ఎంపీ కొడుకును కిడ్నాప్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని ప్రశ్నించాడు. కేంద్రం నిధులు మళ్లించి..వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. సభకు రావడం కాదు.. తనను అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. తాను రాష్ట్రం క్షేమం కోరుకుంటున్నాని తెలిపారు. కాకినాడ ప్రజలకు నాప్రాణం అడ్డేసి కాపాడతానన్నారు. సీఎం అండ చూసుకొని కాకినాడ ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ స్వరం పెంచారు