వింటేజ్ లుక్లో పవర్ స్టార్.. లుంగీలో అదరగొట్టిన మామా అల్లుడు

పవన్ ఫ్యాన్స్(Pawan fans) గెట్ రెడీ. బ్రో(Bro Movie) మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan) మరోసారి దేవుడిగా కనిపించనున్న ఈ సినిమాలో.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai dharan tej) మరో కీ రోల్ లో కనిపించనున్నారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీంతో ప్రమోషన్స్ పనుల్లో బిజీ కానున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా టీజర్ అప్డేట్ ఇస్తూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మెగా మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. తమ్ముడు సినిమాలో వయ్యారి భామ సాంగ్ లో రైల్వే కూలి గెటప్ వేసుకోని మాసీ లుక్ లో కనిపిస్తారు పవన్. ఇప్పుడు ఇదే లుక్ ను సాయి ధరమ్ అండ్ పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేసారు. దీంతో ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పోస్టర్ దర్శనమిస్తోంది. ఇక థియేటర్స్ లో ఈ సీన్ మెగా ఫాన్స్ రచ్చ చెయ్యడం గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

ALSO READ:మేరా భారత్ మహాన్ : అమెరికాలోని స్కూల్స్ కు.. దీపావళి సెలవు

తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samutirakhani) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో..  కేతిక శర్మ(Kethiks sharma), ప్రియా ప్రకాష్ వారియర్(Priya prakash variour) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)  డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు.