
టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ రాజ్ కుంభమేళాకి వెళ్లి పుణ్య స్నానాలు చేశాడు. ఇందులోభాగంగా తన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పవన్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో పవన్ తోపాటూ అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్ కూడా నదిలో మునిగి గంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుంభమేళా సందర్భంగా సీఎం యోగి అదిత్యనాథ్ చేసిన ఏర్పాట్లని ప్రశంసించాడు. అలాగే కుంభమేళ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చాటిందని అన్నారు. మనకి వివిధ భాషలు, ఆచారాలు ఉనప్పటికీ ఒకే ధర్మానికి అందరూ కట్టుబడి ఉన్నారని గ్రేట్ అన్నారు. ఇక కుంభమేళా కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇందులోని హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.