
తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితో పాటు అన్నా కొణిదల తలనీలాలు సమర్పించుకున్నారు.
ఆదివారం సాయంత్రానికి తిరుమలకు చేరుకున్న అన్నా కొణిదల ముందుగా గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని తిరుమల శ్రీవారిని పవన్ భార్య దర్శించుకుంటారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారిని దర్శించుకొని అన్నా కొణిదల మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read : శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
సింగపూర్లో పవన్, అన్నా కొణిదెల కుమారుడు మార్క్ శంకర్కు (ఏప్రిల్ 8) అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్ గాయపడ్డాడు. మంటల ధాటికి శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ దూరడంతో అస్వస్థతకు గురయ్యాడు. మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కొడుకును తీసుకుని ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు.
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025
శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించిన శ్రీమతి అన్నా కొణిదల గారు. pic.twitter.com/ELBA9IN1EC