పవన్ ​కల్యాణ్​ కామెంట్స్ వైరల్​

పవన్ ​కల్యాణ్​ కామెంట్స్ వైరల్​

హైదరాబాద్, వెలుగు : అల్లు అర్జున్​ అరెస్టయిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ ఆ రాష్ట్రంలో మాట్లాడిన మాటలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. స్వర్ణాంధ్ర విజన్​2047 విజన్​ డాక్యుమెంట్​ఆవిష్కరణ సభ విజయవాడలో శుక్రవారం జరిగింది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్, లోకేశ్​ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్​కల్యాణ్​ మాట్లాడుతూ ‘చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్​వి స్టాండ్.. డివైడెడ్ ​వి ఫాల్​అని.. కలిసి ఉంటే ఎంత బలం ఉంటది. విడిపోతే ఎంత బలహీననడతాం’ అనేది ..అంటూ కామెంట్​చేశారు. డిప్యూటీ సీఎంవో, ఏపీ అఫీషియల్​ఎక్స్​ఎకౌంట్​లో పవన్​చేసిన కొటేషన్​ను యథాతధంగా పోస్ట్​చేశారు. ఇది పలు రకాల చర్చకు దారి తీసింది.