ఓజీ వచ్చాక కేజీఎఫ్ గుర్తుండదు.. అంతకు మించి ప్లాన్ చేస్తున్న సుజీత్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో స్ట్రాంగ్ బజ్ ఉన్న సినిమా ఏదైనా ఉదంటే అది ఓజీ(OG) అనే చెప్పాలి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన గ్లింప్స్ కు కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇలా కదా మేము పవన్ కళ్యాణ్ ను చూడాలనుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తూ తెగ సంబరపడిపోయారు.  

ఇదిలా ఉండగా.. ఓజీ మూవీ నుండి పవన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ఏంటంటే.. ఇప్పటికే రిలీజైన టీజర్ బట్టి చూస్తే ఓజీలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని క్లియర్ గా అర్థమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. OG లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ KGFని మించిన ఎలివేషన్స్ కూడా ఉంటాయట. అది కూడా పది రెట్లు పవర్ ఫుల్ గా. ఇది ఊహించుకువడానికే భయంకరంగా ఉంది కదా. అవును దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారట. ఈ న్యూస్ తెలుసుకొని పవన్ ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోతున్నారు. ఓజీ వచ్చాక కేజీఎఫ్ గుర్తుండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ లో హైపెక్కిస్తున్న ఓజీ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.