జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో గణ రాసిన ది రియల్ యోగి బుక్‌ని నాగబాబు ఆవిష్కరించారు. ప్రజలకు సేవ చేయాలనే పట్టదలతోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని నాగబాబు అన్నారు. పవన్ మాట్లాడుతుంటే మోటివేషన్‌లా ఉంటుందన్నారు. లగ్జరీగా బతికే అవకాశం ఉన్నా వదిలిపెట్టి ప్రజలే తన కుటుంబంగా జీవిస్తున్నాడని చెప్పారు.
ది రియల్ యోగి బుక్‌ని చదివానని.. అందరికి అర్థం అయ్యేలా బుక్‌ని రాశారని నాగబాబు అన్నారు. ఈ బుక్‌ని అద్భుతంగా రాశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిప్రాయమే బుక్ లో రాశారని.. ఇది హర్షించదగ్గ విషయం అన్నారు. తాను దేవుడిని నమ్మను కాని దేవుడిని నమ్మేవాళ్లను ఇష్టపడతానని నాగబాబు తెలిపారు. మంచి చెడు ప్రతి మనిషిలో ఉంటాయి కాని... కోపాన్ని అదుపులో పెట్టుకుంటేనే గొప్పవాళ్లం అవుతామని నాగబాబు స్పష్టం చేశారు