టాలీవుడ్ ప్రముఖ హీరో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి (OG) అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కి జోడీగా తమిళ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు మరియు సింగర్ ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగు ప్రముఖ సినీ నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అయితే ఓజి చిత్రం ఇప్పటికే రిలీజ్ కావలసి ఉంది. కానీ షూటింగ్ పనులు పూర్తీకాక పోవడంతో అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. మళ్ళీ చిత్ర యూనిట్ ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది.
ALSO READ | ఓటీటీలోకి రాబోతున్న కార్తీ సత్యం సుందరం..
ఓజి చిత్ర యూనిట్ ఓజీ చిత్ర పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి కారుపై కత్తిపెట్టి నిలబడి పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. దీంతో పవన్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో మరోసారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పోస్టర్ ఒక్కసారిగా ఓజీ పై అంచనాలు పెంచేసింది. దీంతో ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ పూర్తీ కావడంతో వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.