టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగులో ఓజి(OG) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఇమ్రాన్ హష్మి(బాలీవుడ్) తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జపాన్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇప్పటికే 2 ఏళ్లు కావస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చిత్ర యూనిట్ పవన్ కి సంబందించిన షెడ్యూల్ త్వరగతిన పూర్తీ చేశారు. కానీ ఇప్పటివరకూ ఓజి చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
అయితే ఇటీవలే తెలుగు ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్ మరియు టాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ తేజ్ మట్కా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఓజి సినిమా గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా మరో 4 రోజుల్లో ఓజి సినిమా షూటింగ్ పూర్తవబోతోందని, అలాగే ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైనమెంట్ఉంటుందని చెప్పారు.
ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ కళ్యాణ్ బాబాయ్ తో పాటూ తాను కూడా ఓజి కథ విన్నానని కచ్చితంగా వేరే లెవెల్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా కరుణకుమార్ దర్శకత్వం వహించిన మట్కా చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక నవీన్ చంద్ర, నోరా ఫతేహి(బాలీవుడ్), మిమి గోపి, కిషోర్, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి స్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది