
కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాసేపు సేదతీరారు. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ దగ్గర కాసేపు విరామం తీసుకున్న తర్వాత ఆహారం తీసుకున్నారు. మట్టిగిన్నెలో జొన్నఅన్నం మజ్జిగలో కలుపుకొని పచ్చిమిరపకాయ పచ్చడితో నంజుకొని తిన్నారు. వేపచెట్టు కింద కూర్చొవడానికి తాటాకు చాపలను జనసైనికులు ఏర్పాటు చేశారు. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదం కలిగించడంతో జనసేనాని కాసేపు తాటాకు చాపలపైనే విశ్రాంతి తీసుకున్నారు.