
హైదరాబాద్ : తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని..తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జనసేన- బీఎస్పీ బహిరంగ సభలో మాట్లాడారు పవన్. “ 2009లో సామాజిక న్యాయం పేరుతో మార్పుకు శ్రీకారం. తెలంగాణపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. తెలంగాణ సాక్షిగా మాయావతి గారికి పాదాభివందనం. నా ఆత్మ తెలంగాణలో ఉంది. మాయావతి.. కల్వకుంట్ల కవితలాగా కేసీఆర్ కూతురు కాదు. 2008లోనే BSPతో కలవాలని చూశాం. ఆంధ్ర పాలకు చేసిన తప్పులకు ఆంధ్రా ప్రజలను అనవద్దు.
కష్టజీవుల జీవితాలను మాయావతి క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నారు. విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడినో అర్థం కాలేదు. తెలంగాణ ఉద్యమం నా చేతుల్లో ఉండి ఉంటే.. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించే వాడిని. చైతన్యంతో పారాడాలని చెప్పిన నేల తెలంగాణ. కేసీఆర్ పాలన గురించి నేను అడ్డగోలుగా మాట్లాడను. తెలంగాణ వెనుకబాటుతనం, దోపిడికి గురైన విధానం నాకు తెలుసు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుంటే ఎలా. దళిత ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాటతప్పారు. అందుకు కేసీఆర్ కు చాలా కారణాలు ఉండవచ్చు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం.” అని తెలిపారు పవన్.