విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లోపు.. రూ. 17.5 కోట్లు చెల్లించాలని హెచ్సీఏను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2014లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి బ్యాంకు నుంచి అప్పు తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది విశాఖ ఇండస్ట్రీస్. ఆ తర్వాత విశాఖ ఇండస్ట్రీస్తో ఉన్న స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ను HCA( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) రద్దు చేసింది. ఈ క్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ హైకోర్టును ఆశ్రయించింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు.. 18 శాతం ఏడాది వడ్డీతో రూ. 25 కోట్లు చెల్లించాలని 2016 లో కోర్టు హెచ్సీఏను కోర్టు ఆదేశించింది.
విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్సీఏ ప్రాపర్టీస్, బ్యాంక్ అకౌంట్స్ను 2022 అక్టోబర్లో అటాచ్ చేసింది కమర్షియల్ కోర్టు. దీన్ని సవాల్ చేస్తూ.. బ్యాంక్ అకౌంట్స్ డీఫ్రీజ్ చేయాలంటూ హైకోర్టులో అప్పీల్ చేసింది హెచ్సీఏ. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరు వారాల్లోగా రూ. 17.5 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించాలనిహెచ్సీఏను ఆదేశించింది.
2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణం కోసం హెచ్సీఏకు తమ కంపెనీ స్పాన్సర్ షిప్ చేసిందని విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్పాన్సర్ షిప్ చేసినందుకు విశాఖ ఇండస్ట్రీస్ కి కొన్ని రైట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ అగ్రిమెంట్ ను.. హెచ్సీఏ క్యాన్సల్ చేసిందని తెలిపారు. చట్ట ప్రకారం విశాఖ ఇండస్ట్రీ.. కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారాయన. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు చట్ట ప్రకారం రూ. 25 కోట్లతో పాటు సంవత్సరానికి 18 శాతం ఇంట్రెస్ట్ పే చేయాలని.. 2016లోనే హెచ్సీఏకి కోర్టు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. దీనిపై హెచ్సీఏ కమర్షియల్ కోర్టుకు అప్పీల్ కి వెళ్లినా.. ఎక్కడా స్టే ఇవ్వలేదన్నారు.
ALSO READ :మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..
2022 అక్టోబర్ లో హెచ్సీఏ ఆస్తులన్నీ అటాచ్ చేస్తూ.. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ కమర్షియల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా.. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ తో పాటు ఇతర మ్యాచ్ లను హెచ్సీఏ నిర్వహించిందని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ డీ ఫ్రీజ్ చేయాలంటూ హెచ్సీఏ హైకోర్టు కి వెళ్ళిందన్నారు. హైకోర్టు కూడా ఆరు వారాల్లోగా రూ. 17.5 కోట్లు.. మా అకౌంట్ లో డిపాజిట్ చేయాలని తీర్పు ఇచ్చిందని చెప్పారు. హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు.. చొరవ తీసుకుని విశాఖ ఇండస్ట్రీస్ కి ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోవాలని సూచించారు ఇండస్ట్రీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.