![అన్ లిమిటెడ్ ఆఫర్.. పానీపూరి జీవితం కాలం ఎంత తింటే అంత..](https://static.v6velugu.com/uploads/2025/02/pay-rs-99-000-nagpur-vendor-offers-unlimited-pani-puri-for-life-with-one-time-payment_TBFhrXbWES.jpg)
వ్యాపారం అభివృద్ది చేసుకోవడానికి పెద్దపెద్ద బిజినెస్ మ్యాన్లు మార్కెటింగ్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంటారు.. అయితే ఇక్కడో స్ట్రీట్ వెండర్.. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఓ వినూత్న మైన ఆఫర్ ను ఇచ్చాడు. మనం ఓటీటీ ప్లాట్ ఫాంలు, నెట వర్క్ లు రీచార్జ్ చేసుకునేందుకు అన్ లిమిటెడ్ ఆఫర్ల మాదిరిగానే పానీపూరికి కూడా అన్ లిమిటెడ్ ఆఫర్ పెట్టాడు. అన్లిమిటెడ్ ఆఫర్..కస్టమర్లూ..ఒక్కసారి చెల్లించండి..జీవిత కాలం ఉచితంగా మీరు ఎప్పుడైనా షాపుకు వచ్చి మీకు ఇష్టమొచ్చినన్ని పానీపూరీలు తినండి..ఆఫర్ బోర్డు పెట్టాడు. నాగ్ పూర్ లో పానీపూరి అమ్మే వ్యాపారి ఆఫర్ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..నెటిజన్లనుంచి స్పందనలు జోరుగా వచ్చాయి.
ఇగ ఈ గోల్ గప్పాస్ వెండర్ కు ఆఫర్ కు సోషల్ మీడియాలో రిప్లైల వరద పారింది. చాలా మంది కస్టమర్లు వ్యక్తులు తమ అభిప్రాయాలను తమదైన శైలిలో జోకులను పేల్చుతూ పోస్టులు షేర్ చేశారు. marketing.growmatics ద్వారా చేసిన పోస్ట్‌కి 47వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఆఫర్ మాకోసమా.. లేక గోల్ గప్పా వెండర్ కోసమా అని వ్యంగ్యంగా స్పందించారు. ఈ ఆఫర్ కు చట్టబద్దగా కల్పించాలి అంటూ హాస్యంగా మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యారు.
మరోనెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఏం నాయనా.. నువ్వు ఆఫర్ బాగానే పెట్టావు.. తీరా పేమెంట్ చెల్లించాక..దుకాణం మూసుకొని వెళితే మా పరిస్థితి ఏంటీ’’ అని హాస్యంగా స్పందించారు.