టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో గత ఏడాది వచ్చిన "మంగళవారం" సినిమా సూపర్ హిట్ అయ్యింది. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకి థియేటర్స్ లో అలాగే ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆర్ఎక్స్100 మూవీ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. తెలుగు హీరో, కమెడియన్ ప్రియదర్శి, దివ్య పిళ్ళై, నందిని శ్వేత, రవీంద్ర విజయ్, చైతన్య, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోకనాథ్ మ్యూజిక్, బీజియం అందించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇటీవలే సంవత్సరం కావడంతో మేకర్స్ మంగళవారం సినిమా సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం 2 స్క్రిప్ట్ పనులు పూర్తిచేసి షూటింగ్ పనులు ప్రారంభించడానికి ముహూర్తం చూస్తున్నట్లు సమాచారం. అయితే మంగళవారం సినిమా ని దర్శకుడు అజయ్ భూపతి నిర్మించాడు. దీంతో మంగళవారం 2 ని కూడా అజయ్ భూపతి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి బడ్జెట్ మరింత పెంచి పాన్ ఇండియా లాంగ్వేజస్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా హీరోయిన్ పాయల్ రాజపుత్ కి ఆర్ఎక్స్100 తర్వాత గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. దీంతో దాదాపుగా పాయల్ కెరీర్ ముగిసిపోతుందన్న సమయంలో మంగళవారం సినిమా హిట్ ఆమె కెరీర్ కి ఉపిరి పోసింది. ఇక దర్శకుడు అజయ్ భూపతికి కూడా ఆర్ఎక్స్100 తర్వాత మహా సముద్రం సినిమాతో ఫ్లాప్ ఎదురైంది. ఆ తర్వాత తీసిన మంగళవారం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. మరి మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న అజయ్ భూపతి మంగళవారం 2తో ఎలా అలరిస్తాడో చూడాలి.