బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..

బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..

ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమన తార పాయల్ రాజ్ పూత్. తన గ్లామర్ తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన  బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. 

ఇందులోభాగంగా అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది 'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శు భాకాంక్షలు. నీ దయ, సపోర్ట్ నా జీవితా నికి నిజమైన బ్లెస్సింగ్స్. అన్ని వేళల్లో మీ గైడెన్స్, ప్రేమను అందిస్తున్నందుకు కృత జ్ఞతలు. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పు డు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, స్నేహితులు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాజ్ పూత్ తెలుగులో "కిరాతక" అనే సినిమలో నటిస్తోంది. ఈ సినిమాని నూతన డైరెక్టర్ వీరభద్రం  క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు.