500 ఏళ్ల నాటి కల సాకరం చేసిన ప్రధాని మోదీ : పాయల్​ శంకర్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  హిందువుల 500 ఏళ్ల నాటి కల అయిన రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీ ద్వారా నెరవేరిందని ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ అన్నారు.  రామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించబోయే శోభాయాత్ర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.  శోభాయాత్రలో రామ భక్తులకు   ఇబ్బందులు కలగకుండా  చూడాలని పోలీసు శాఖ అధికారులను కోరారు. 

ఈ యాత్రలో పాల్గొనడానికి వస్తున్న భక్తుల కోసం మంచినీరు, ప్రసాదం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమి పండుగను హిందువులు భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. శ్రీరామ ఉత్సవ సమితి  నాయకులు రాళ్ల బండి మహేందర్, కె. సాయి, మహేందర్, జోగు రవి, ఆకుల ప్రవీణ్, సురేందర్, అర్జున్, నాగేందర్ గౌడ్, నిఖిల్, శివ గౌడ్, గోపి, సచిన్ పాల్గొన్నారు.