ఆదిలాబాద్టౌన్, వెలుగు : భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ పార్లమెంట్ఇన్చార్జి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేశ్ ఎంపికైన తర్వాత శుక్రవారం ఆయన మొదటి సారి జిల్లా కేంద్రానికి రావడంతో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు
స్థానిక మావలలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు అశోక్, నగేశ్, విజయ్, మయూర్ చంద్ర, చిలుకూరు జ్యోతి రెడ్డి, ధోని జ్యోతి, దయాకర్, రాజేశ్, రాందాస్, సుభాష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.