ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన అరాచకాలను ఎండగట్టడమే లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని భాగ్యనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు యాదవ సంఘం సభ్యుల సమావేశానికి పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్రమేశ్చీఫ్ గెస్ట్లుగా హాజరై మాట్లాడారు. యాదవులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఈసారి బీజేపీకి పూర్తి మద్దతు తెలుపనున్నట్లు యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జోగు రవి, ఆకుల ప్రవీణ్, రాజేశ్, మహేందర్, ధోని జ్యోతి, పద్మా గౌడ్, ప్రపోల్, రాణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.