ఆదిలాబాద్, వెలుగు: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. లక్ష్మారెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.