ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఓటర్ లిస్టులో అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ ఆరోపించారు. గురువారం ఆయన కలెక్టర్రాహుల్ రాజ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జాతీయ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేశారు. బీజేపీ అనుకూల వర్గాల పేర్లను ఓటరు లిస్ట్‌లో నుంచి డిలీట్ చేపిస్తున్నారని, దొంగ ఓట్లను జొప్పిస్తున్నారని ఆరోపించారు.
2018 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన చోట్ల దాదాపు 20 వేల ఓట్లను గల్లంతు చేశారని పేర్కొన్నారు. న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఎమ్మెల్యే అడ్డదారులు తొక్కుతున్నారని ఫైర్అయ్యారు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా నాయకులు ముకుంద్, బుమా రెడ్డి, కేశవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.