కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు న్యాయం : పాయం వెంకటేశ్వర్లు

కరకగూడెం, వెలుగు : కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లో తుమ్మలగూడెం, చొప్పాల, గొల్లగూడెం, కొత్తగూడెం, అనంతారం, పద్మాపురంతోపాటు పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. పదేండ్లుగా బీఆర్​ఎస్​ సర్కారు ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే భూకబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు చేయడం తప్ప నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదని ఆరోపించారు. ఈసారి తనను గెలిపిస్తే పినపాక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

ALSO READ : నేతకానిలకు న్యాయం చేయని .. దుర్గం చిన్నయ్యను ఓడిస్తం