గుండాల/ఆళ్లపల్లి, వెలుగు : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆళ్లపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయం రామ నరసయ్య, పడిగ సమ్మయ్య, గౌరబోయిన సుబ్బారావు, అతహర్, రహీం, మిత్రపక్ష నాయకులు రేస్ ఎల్లయ్య , రహీం పాల్గొన్నారు.
ALSO READ : రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారు : కేటీఆర్