న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో వాడుకుంటామనడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ కంటే ఎక్కువ సెక్యూరిటీ, ప్రైవసీని అందిస్తున్న సిగ్నల్ అప్లికేషన్‌కు అందరూ మారాలని ప్రముఖ అమెరికన్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సిగ్నల్ యాప్‌కు మద్దతు ఇస్తున్న వారిలో తాజాగా పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా చేరారు. వాట్సాప్, ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం చేస్తున్నాయని విరుచుకుపడిన విజయ్ శర్మ.. ఈ రెండు సంస్థలూ యూజర్ల ప్రైవసీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఫైర్ అయ్యారు. సిగ్నల్ యాప్‌కు మారాలని సూచించారు.
They say, market has power. We are the largest market.
Here in India WhatsApp / Facebook are abusing their monopoly & taking away millions of users' privacy for granted.
We should move on to @signalapp NOW.
It is upto us to become victim or reject such moves. https://t.co/iCmKoyLc5x— Vijay Shekhar Sharma (@vijayshekhar) January 11, 2021
‘మార్కెట్‌లో పవర్ ఉందని వాళ్లు అంటున్నారు. అతిపెద్ద మార్కెట్ మనదే (ఇండియా). భారత్‌లో వాట్సాప్/ఫేస్‌బుక్ తమ గుత్తాధిపత్యాన్ని చూపిస్తున్నాయి. లక్షలాది యూజర్ల ప్రైవసీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మనం సిగ్నల్ యాప్‌కు జంప్ అవ్వాలి. ఇలాంటి వాటికి బాధితులు అవ్వాలా లేదా వీటిని తిరస్కరించాలా అనేది మన చేతుల్లోనే ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు.