ప్రముఖ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సంస్థ తమ కంపెనీలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇంజనీరింగ్, సేల్స్ టీమ్ టీమ్ నుంచి సిబ్బందిని తొలగించింది. ఉద్యోగుల తొలగింపునకు అసలు కారణం.. పేటీఎం కంపెనీ AI-ఆధారిత ఆటోమేషన్‌ను అమలు చేయమే.
పేటీఎం ఏకంగా వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఉద్యోగుల తొలగింపుకు కంపెనీ చెప్పిన కారణం షాకింగ్ గా ఉంది. ఉద్యోగుల పేలవమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని విస్తృతంగా ఉపయోగించడమే ఉద్యోగుల తొలగింపుకి అసలు కారణమని కంపెనీ తెలిపింది. AI వినియోగంతో కంపెనీ సామర్థ్యాలను మరింత పెంచుకోవచ్చని Paytm తెలిపింది. దాదాపు నెల రోజులుగా కంపెనీ తన పనితీరులో మార్పులు చేస్తోంది.
ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుండడంతో ఆ ఎఫెక్ట్ ఉద్యోగులపై చూపిస్తోంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో.. ఇక అప్పటి నుంచి ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వేలమంది ఉద్యోగులను పలు ప్రముఖ కంపెనీలు జాబ్ లో నుంచి తీసివేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని గతంలో పలు నివేదికలు వచ్చాయి.
Paytm దాని కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి AIని ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. AI ఆధారిత సాంకేతికతతో తమ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని, సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని Paytm ప్రతినిధి తెలిపారు. AI వినియోగం వల్ల పని వేగం పెరగడమే కాకుండా ఉద్యోగుల ఖర్చును 10 నుంచి 15 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. సాంకేతికతలో మార్పుతో ఏడాది పొడవునా పనితీరు సరిగా లేని ఉద్యోగులను తొలగించే ప్రణాళికను కూడా రూపొందించామన్నారు. 2021 సంవత్సరంలో కూడా, పేటీఎం సంస్థ 500 నుండి 700 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది.