Paytm పేమెంట్ బ్యాంక్స్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ ద్వారా అన్ని లావాదేవీలు నిలిచి పోయాయి..మరీ Paytm FASTag కూడా పనిచేస్తుందా లేదా.. ఫాస్టాగ్ ను ఉపయోగించి టోల్ వద్ద చెల్లింపు చేయొచ్చాలేదా, జీతం Paytm పేమెంట్స్ బ్యాంకులో జమ అయితే అమౌంట్ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చా.. ఇలా కస్టమర్లకు చాలా విషయాలపై అనేక సందేహాలున్నాయి. దీనిపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ .. వినియోగదారులకు కోసం తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) జాబితాను విడుదల చేసింది.
ఈ FAQ లు ఫాస్టాగ్ ఖాతాలలో అవసరమైన కనీస మొత్తం, సెక్యూరిటీ డిపాజిట్ లు ఎలా రీఎంబర్స్ డ్ చేయబడతాయో తెలిపింది. మార్చి 15 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ FASTag కసం డిపాజిట్లు, లేదా టాప్ అప్ లను అంగీకరించబడవని తెలిపింది. PPBL ఫాస్టాగ్లను ఉపయోగించి వినియోగదారులు మార్చి 15 తర్వాత కూడా టోల్ చెల్లించడానికి తమ ఖాతాలోని నిధులను వినియోగించవచ్చని RBI తెలిపింది.
ALSO READ :- వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు ప్రమోషన్ ఉండదు: Dell హెచ్చరిక
తరుచుగా అడిగిన ప్రశ్నలు
జీతం Paytm పేమెంట్స్ బ్యాంకులో జమ అయితే..
Paytm పేమెంట్స్ బ్యాంకులో మీ జీతం జమ అయినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని PPBL తెలిపింది. నగదు విత్ డ్రా, బదిలీ, మీ డబ్బును మొత్తం ఖర్చు చేసేందుకు అనుమతించబడును.
మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాను నుంచి డబ్బు విత్ డ్రా చేయొచ్చా..?డెబిట్ కార్డుని ఉపయోగించవచ్చా?
మార్చి 15 తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్స్ ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త డిపాజిట్లు అనుమతించబడవు.. క్రెడిట్ లావాదేవీలు అనుమతించబడవు. డెబిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా, బదిలీలు చేయొచ్చు.