ఇప్పటివరకు Paytm అంటే మనకు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ యాప్ అని..యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు చేసే డిజిటల్ ఫ్లాట్ ఫారంగానే మనకు తెలుసు..ఇకపై పేటీఎం ఇప్పుడు రైడ్ హెయి లింగ్ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది.అంటే ఓలా, ఊబర్ సంస్థల మాదిరిగా ఆటో రైడ్ లను అందించేందుకు సిద్దమవుతోంది.
ఢిల్లీ,బెంగళూరు, చెన్నైలాంటి మెట్రో నగరాల్లో ఎక్కడికైనా బయటికి వెళ్తున్నట్లయితే ఇప్పుడు ఓలా, ఊబర్ మాత్రమే కాకుండా Paytm ద్వారా కూడా ఆటో బుక్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మిగతా మెట్రోనగరాల్లో రైడ్ మొదలు పెట్టనుందట. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా ఓలా, ఊబర్ కు పోటీగా రైడ్ హెయిలింగ్ రంగంలోకి ప్రవేశించింది. Paytm యాప్ లో ఈ రైడ్ హెయిలింగ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కొంత మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
నమ్మయాత్రి సపోర్టుతో ఆటో బుకింగ్
Paytm యాప్ ద్వారా ఆటోను బుక్ చేసినప్పుడు ఆ ఫీచర్ పవర్డ్ బై నమ్మయాతర్ి అని కనిపిస్తుంది. అంటే ఈ ఫీచర్ నమ్మయాత్రి సపోర్టుతో పనిచేస్తుంది. ఈ లావాదేవీలో నమ్మయాత్రి యాప్ గా పనిచేస్తుంది. గత రెండేళ్లలో ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు సహా ఏడు నగరాల్లో నమ్మయాత్రి ద్వారా 3.73 కోట్ల రైడ్లు నిర్వహించింది. దీని ద్వారా చాలావారకు ఆటోల ద్వారా రైడ్ నడిచింది. ఇప్పుడు ఇది క్యాబ్ లను బుకింగ్ ను కూడా ప్రారంభిస్తోంది. Paytm ద్వారా కూడా రాబోయే రోజుల్లో క్యాబ్ బుకింగ్ చేసుకోవచ్చట.
Paytm E-commerce Private Limited ఇప్పుడు Pai ప్లాట్‌ఫారమ్‌లు.. ఇంతకు ముందు ఒకసారి Paytm మాల్ అనే యాప్‌ను ప్రారంచి ఈ-కామర్స్‌లో చేతులు కాల్చుకుంది. 2018 ప్రారంభంలో అలీబాబా , సాఫ్ట్‌బ్యాంక్ వంటి పెట్టుబడిదారుల నుంచి $2 బిలియన్ల కంటే ఎక్కువ విలువతో 400 మిలియన్ల డాలర్లను సేకరించింది. అయితే అలీబాబా 2022లో కంపెనీలో రూ.100 కోట్లకు పైగా తన మొత్తం వాటాను విక్రయించడంతో ఈ వ్యాపారం విఫలమైంది.