న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ యజమాని వన్97 కమ్యూనికేషన్స్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్సర్వీసెస్లో పెట్టుబడి కోసం ప్రభుత్వ ఆమోదాన్ని పొందింది. ఫలితంగా కంపెనీ తన చెల్లింపుల సేవల వ్యాపారం కోసం లైసెన్స్‌ను తిరిగి పొందేందుకు మంత్రిత్వ శాఖకు మళ్లీ దరఖాస్తు చేయవచ్చు.
పేటీఎం పేమెంట్ సర్వీసెస్ ఇప్పటికే ఉన్న భాగస్వాములకు ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేషన్ సేవలను అందించడాన్ని కొనసాగిస్తుందని కంపెనీ తెలిపింది.