హైదరాబాద్, వెలుగు: వివిధ రకాల ఫ్లైట్ బుకింగ్స్‌పై భారీగా డిస్కౌంట్‌ను ప్రకటిస్తూ ట్రావెల్ సేల్‌ను పేటీఎం ప్రారంభించింది. ఈ నెల 17 నుంచి 19 మధ్య ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌లోని హాలిడేస్ కోసం పేటీఎం ట్రావెల్ సేల్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. గోఫస్ట్, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ల కోసం పేటీఎం ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నవారికి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. లోకల్‌గా ట్రావెల్ చేయాలనుకునేవారికి ఫ్లైట్ టికెట్స్‌పై 18 % డిస్కౌంట్‌ను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్ చేసేవారికి 12% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఆర్బీఎల్ బ్యాంక్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ), అమెక్స్ (క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ) లు ఇచ్చే బ్యాంక్ ఆఫర్స్ ద్వారా ఈ డిస్కౌంట్‌ను ఇస్తోంది. స్టూడెంట్లు, సీనియర్ సిటిజన్లు, మిలిటరీ పర్సనల్స్ నుంచి కన్వెనియెన్స్ ఫీజు తీసుకోవడం లేదు. బస్ బుకింగ్స్‌పై 25 % వరకు, దీనికి అదనంగా నిర్ధిష్టమైన ఆపరేటర్ల నుంచి 10 శాతం డిస్కౌంట్‌ను పేటీఎం ఆఫర్ చేస్తోంది. 2,500 మంది ఆపరేటర్ల నుంచి తక్కువ రేటుకే బస్ బుకింగ్స్ జరుపుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ట్రైన్ టికెట్స్‌కు సంబంధించి యూపీఐ పేమెంట్స్‌పై పేమెంట్ గేట్‌వే ఛార్జీలను తీసుకోవడం లేదు. పేటీఎం యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్, పీఎన్ఆర్ స్టేటస్‌ను చెక్ చేయడం, ట్రైన్ లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేయడం వంటివి చేసుకోవచ్చు. ఫ్లైట్ లేదా బస్ టికెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటే 100 % రీఫండ్‌ను పేటీఎం ఇస్తోంది.