గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఔట్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఔట్

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాంట్ పేమెంట్స్ యాప్ అయిన పేటీఎంను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. అయితే పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ లాంటి మరికొన్ని పేటీఎం యాప్‌‌లు మాత్రం డౌన్‌‌లోడింగ్‌‌కు అందుబాటులోనే ఉన్నాయి. దీనిపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్‌‌లో పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది. అతి త్వరలో తిరిగి అందుబాటులో ఉంటుందని, ప్రజల డబ్బులు సేఫ్‌‌గా ఉంటాయని స్పష్టం చేసింది. యూజర్లు యథావిధిగా పేటీఎం యాప్‌‌ను వాడుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఎవరైనా పేటీఎం యాప్‌‌ను డౌన్‌‌‌లోడ్ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే యాప్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకున్న యూజర్లు మాత్రం అన్ని సర్వీసులను వాడుకోవచ్చు. పేటీఎం తొలగింపునకు గూగుల్ నిబంధనలను పాటించకపోవడమే కారణమని తెలుస్తోంది.