Paytm షేర్లు మరోసారి ఢమాల్.. 10 శాతం క్షీణత

Paytm షేర్లు మరోసారి ఢమాల్.. 10 శాతం క్షీణత

 Paytm షేర్లు మరోసారి తిరోగమనాన్ని చవిచూశాయి. ఇటీవల 20 శాతం క్షీణతను చూసిన పేటీఎం షేర్లు.. తాజాగా సోమవారం ( ఫిబ్రవరి 5)  మరో 10 శాతం తగ్గాయి. పేటీఎం షేర్ల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 438.50 గా ఉంది. 2022 మార్చి నుంచి ఇప్పటివరకు పేటీఎం షేర్ విలువ ఎప్పుడూ ఇంత తక్కువగా లేదు. 

Paytm పేమెంట్స్ బ్యాంక్ టాప్ మేనేజ్ మెంట్ , కార్యకలాపాలలో పర్యవేక్షణ సమస్యలను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలతో మార్చి 1, 2024 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు నిలిపివేయనున్నారు.  దీంతో Paytm  స్టాక్ ఒక్కసారిగా క్షీణించడం  ప్రారంభమైంది. 

Paytm  యూజర్లపై ప్రభావం 

Paytm పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన క్రమంలో కస్టమర్లు తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై Paytm  క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తప్పా మిగతా కీలకమైన సేవల్లో ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. Paytm  ద్వారా అన్ని  UPI  చెల్లింపులు సజావుగా  పనిచేస్తాయని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ కూడా ధృవీకరంచింది. Paytm వాలెట్ సేవలు కూడా పనిచేస్తాయని, వినియోగదారులు ఈ డిజిటల్ చెల్లింపు ఫీచర్ ని ఉపయోగించవచ్చని నిర్దారించింది. 

ఆందోళనలో Paytm పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు 

Paytm పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షల క్రమంలో దాని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే Paytm పేమెంట్స్ బ్యాంకు ఖాతా ఉన్న  కస్టమర్లు తమ నిధులు , ఖాతాలను ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సంస్థలకు బదిలీ చేసుకోవాలని సూచించారు.