Paytm పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్, ఫాస్ట్ ట్యాగ్ లు ఫిబ్రవరి 29 వరకే పనిచేస్తాయని..ఆ తర్వాత పనిచేయవని బుధవారం (జనవరి 31) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం కస్టమర్లలో పలు సందేహాలు లేవనెత్తాయి. ఫిబ్రవరి 29 తర్వాత యూజర్లలో కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలా వద్దా అనే సందేహం కలుగుతోంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 29 తర్వాత యూజర్లు మరొక బ్యాంకు నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి FASTag ప్రత్యేకమైన UPI ID తో వస్తోంది. Paytm FASTag వినియోగదారులకోసం Paytm Payments Bank కు నేరుగా లింక్ చేయబడి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కస్టమర్ లావాదేవీలను నిలిపివేయమని Paytm పేమెంట్స్ బ్యాంక్ ని ఆదేశించడంతో.. ఫిబ్రవరి 29 తర్వాత Paytm ఫాస్ట్ ట్యాగ్ ని రీఛార్జ్ చేయలేరు. అలాగే FASTag పని చేయదు. దీంతో వాహనాల యజమానులు నగదు రూపంలో రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది.
Paytm ఫాస్ట్ ట్యాగ్ ఫిబ్రవరి 29 వరకు యథావిధిగా పని చేస్తుంది. వినియోగదారులు రీచార్జ్ కొనసాగించవచ్చు. ఫిబ్రవరి తర్వాత Paytm ఫాస్ట్ ట్యాగ్ ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్ తో పనిచేస్తుంది. బ్యాలెన్స్ మొత్తం ముగిశాక మళ్లీ రీచార్జ్ చేయడం సాధ్యం కాదు. Paytm పేమెంట్స్ బ్యాంకు నుంచి వేరొక బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి.. ఏదైనా సపోర్ట్ ఉన్న బ్యాంక్ నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ ను పొందడం ఉత్తమమైన మార్గం.