రూ. 840 కోట్లకుపెరిగిన పేటీఎం నష్టాలు

 రూ. 840 కోట్లకుపెరిగిన పేటీఎం నష్టాలు

న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్​కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్​కు జూన్ క్వార్టర్​లో నష్టం రూ. 840 కోట్లకు పెరిగింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షల ప్రభావం ఇందుకు ప్రధాన కారణమని ప్రకటించింది.   కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ.358.4 కోట్ల నష్టాన్ని చవిచూసింది. తాజా క్వార్టర్​లో పేటీఎం  కన్సాలిడేటెడ్​ ఆదాయం 33.48 శాతం క్షీణించి రూ. 1,639.1 కోట్లకు పడిపోయింది. 

క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,464.2 కోట్లుగా ఉంది.  ఉల్లంఘనల కారణంగా  మార్చి 15 నుంచి కస్టమర్ ఖాతాలు, వాలెట్లు,  ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌‌‌‌‌‌‌‌లను అంగీకరించకుండా పీపీబీఎల్​ను ఆర్​బీఐ నిషేధించింది.  కొన్ని ఉత్పత్తులను కూడా కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది.   

పేటీఎం  జీఎంవీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన రూ.4.69 లక్షల కోట్ల నుంచి 9.1 శాతం క్షీణించింది.  అయితే వార్షిక ప్రాతిపదికన రూ. 4.3 లక్షల కోట్ల జీఎంవీని సాధించింది.