
ఈ ఐపీఎల్ లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో జీరో అవుతారో తెల్వదు. ఎందుకంటే ఆడినప్పుడు అందలం ఎక్కించి.. ఆడనప్పుడు ఎత్తేస్తారు. విమర్శలు గుప్పిస్తారు.
ముంబై బౌలర్ అర్జున్ టెండుల్కర్ తను ఆడిన ఐపీఎల్ రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ ల డెత్ ఓవర్ లో తొలి వికెట్ తీసి ఇటీవల అందరి ప్రశంసలు అందుకున్నాడు. మళ్లీ ఏప్రిల్ 22న పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అర్జున్ టెండుల్కర్ 16 ఓవర్లో 31 పరుగులిచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
అర్జున్ వేసిన 16వ ఓవర్లో పంజాబ్ బ్యాటర్లు శామ్ కరణ్, హర్ ప్రీత్ సింగ్ పరుగుల మోత మోగించాడు. శామ్ కరణ్ ఒక సిక్స్, ఒక ఫోర్, హర్ ప్రీత్ మూడు ఫోర్లు ఒక సిక్సుతో విధ్వంసం సృష్టించారు. అర్జున్ ఈ ఓవర్లలో బంతిపై పట్టు కోల్పోయినట్లు కనిపించింది. బంతి ఎటు వేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఓ నో బాల్ కూడా వేశాడు. మొత్తం ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది.దీంతో సోషల్ మీడియాలో అర్జున్ ను కొందరు ఎగతాలి చేస్తున్నారు. ఏమైంది అర్జున్ నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.