
ముంబైతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దంచికొట్టింది. ముంబైకి 215 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాటర్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
హర్ ప్రీత్ సింగ్ భాటియా 28 బంతుల్లో 41, కెప్టెన్ శామ్ కరణ్ 29 బంతుల్లో 55 రన్స్ తో చెలరేగారు. ఏడవ స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ జితేష్ శర్మ 7 బంతుల్లో 4 సిక్సులతో 25 పరుగులు చేసి మోత మోగించాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లలో కామెరున్ గ్రీన్ 2, పీయూష్ చావ్లా 2, అర్జున్ టెండుల్కర్ 1,జోసఫ్ ఆర్చర్, జేసన్ కు తలో ఒక వికెట్ పడ్డాయి.