అన్నారం బ్యారేజీని పరిశీలించిన పీసీ ఘోష్‌‌‌‌

అన్నారం బ్యారేజీని పరిశీలించిన పీసీ ఘోష్‌‌‌‌
  • బుంగలు పడ్డ చోట తనిఖీలు 
  • రిపేర్ వర్క్స్ పై ఇంజినీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌ ‌‌చైర్మన్‌‌‌‌

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేస్తున్న జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతి) బ్యారే జీని పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్న ఆయన అరగంట పాటు ఎంక్వైరీ చేశారు. బ్లాక్‌‌‌‌‒3, బ్లాక్‌‌‌‌‒4లో పియర్స్‌‌‌‌ కింద బుంగలు పడిన చోట తనిఖీలు చేశారు. 35వ పియర్ వద్ద జరుగుతున్న రిపేర్ పనులపై ఇరిగేషన్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. సిమెంట్‌‌‌‌ బ్లాక్స్‌‌ ఎందుకు కొట్టుకుపోయాయని ప్రశ్నించారు. 

అప్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌లో ఇసుక తొలగించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో జరిగినట్టు ఇక్కడ కూడా పియర్స్‌‌‌‌ కింద ఏమైనా బొయ్యారాలు బయటపడ్డాయా? అని ఇంజినీర్లను అడిగారు. ఇక్కడ బ్యారేజీ కట్టడానికి గల ప్రియారిటీ ఏంటీ? ఈ బ్యారేజీకి ఎక్కడి నుంచి వాటర్‌‌‌‌ వస్తుంది అని తెలుసుకున్నారు. బ్యారేజీలో బుంగలు పడిన తర్వాత చేపట్టిన చర్యలు ఏంటీ? ఇప్పుడు చేపట్టిన రిపేర్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ వల్ల బ్యారేజీకి జరిగే ప్రయోజనం ఏంటీ? అని ఇంజినీర్లను ప్రశ్నించారు. 

ఫస్ట్‌‌‌‌ విజిట్‌‌‌‌లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన పీసీ ఘోష్‌‌‌‌ తన సెకండ్‌‌‌‌ విజిట్‌‌‌‌లో శుక్రవారం అన్నారం బ్యారేజీకి వచ్చి విచారణ జరిపారు. శనివారం ఆయన పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల (పార్వతి) బ్యారేజిని పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. సీఈ విజయ భాస్కర్‌‌‌‌ రెడ్డి, డిప్యూటీ ఈఎన్‌‌‌‌సీ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఈఈ యాదగిరి, క్వాలిటీ కంట్రోల్‌‌‌‌ ఈఈ రఘురాం తదితరులు ఉన్నారు.