సూర్యపవన్‌‌కు పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్

యాదాద్రి, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి అన్న కొడుకు డాక్టర్​ సూర్య పవన్​ రెడ్డికి ‘పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్‌‌’ వచ్చింది.  దేశంలో విద్య, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో  విశేష సేవలు చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ‘పవర్ కారిడార్ నేషనల్ మేగజైన్’ ఏటా ఈ అవార్డులు అందిస్తోంది.  

ఇందులో భాగంగా 23 ఏండ్లుగా  టైప్​1 షుగర్​ వ్యాధి నిర్మూలన కోసం కృషి చేస్తున్న కోమటిరెడ్డి సూర్య పవన్​ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ చేతుల మీదుగా సూర్య పవన్​ రెడ్డి అవార్డ్​ అందుకున్నారు.  ఇతనిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి అభినందించారు.