జనగామ అర్బన్, వెలుగు : బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని బెంగళూర్ ఎంపీ పీసీ మోహన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్ లో బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ అధ్యక్షులు ఆపైస్థాయి కార్యకర్తల సమావేశానికి జనగామ ఇన్చార్జి యాప సీతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి విజయ రామారావుతో కలిసి ఆయన దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వకుండా గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఉడుగుల రమేశ్, మాదాసి వెంకన్న, సౌడ రమేశ్, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, మాచర్ల భిక్షపతి, బెజాడి బీరప్ప, పవన్ శర్మ, బల్ల శ్రీనివాస్, హరిశ్చంద్ర గుప్త, సంపత్ కుమార్, అశోక్ పాల్గొన్నారు.