2023 అక్టోబర్ 5నుంచి మొదలుకానున్న వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆసియా కప్‌లో జట్టు ప్రదర్శనపై 2023 సెప్టెంబర్ 21న సమీక్ష నిర్వహించిన సెలక్టర్లు ఇవాళ జట్టును ప్రకటించారు. ఆసియా కప్‌లో గాయం కారణంగా కీలక ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత సంతతి అమ్మాయి. ఆమె దుబాయ్ లో ఫ్లయిట్ ఇంజనీర్ గా పని చేస్తుంది. వీరిద్దరు కొన్నాళ్లు ప్రేమలో మునిగితేలాక పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.
Also Read :- World Cup2023: ఐసీసీ కొత్త రూల్స్.. బ్యాటర్లకు ఇక చుక్కలే
పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్ ), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్ ), ఫఖర్ జమాన్ , ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఉసామా మీర్, మొహమ్మద్ వసిమ్.
Pakistan unveil squad for the World Cup campaign ???
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023
More details ➡️ https://t.co/hanhk17ACZ#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/HY9cWDGnQn