పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం (ఆగస్ట్ 12) ప్రకటించింది.టిక్కెట్లు PCB.tcs.com.pk ద్వారా ఆగస్టు 13.. సాయంత్రం 5 గంటల నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అయితే టికెట్స్ రేట్లను పాక్ క్రికెట్ బోర్డు దారుణంగా తగ్గించింది.
బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. రెండో టెస్ట్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరగనుంది. తొలి టెస్ట్ కు టికెట్ ధర రూ. 60 కాగా.. రెండో టెస్ట్ కు రూ. 15 కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దశాబ్ద కాలంలో కరాచీ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టికెట్స్ విక్రయించడం ఇదే తొలిసారి. 16 నెలల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను నిర్వహిస్తున్నందున మ్యాచ్ చూడడానికి అభిమానులు వస్తారో లేదో అనే భయంతో భారీగా టికెట్ ధరలను తగ్గించినట్టు తెలుస్తుంది.
2024 పాకిస్థాన్ సూపర్ లీగ్ ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఖాళీ స్టాండ్స్ లోనే చప్పగా ఈ మ్యాచ్ లు ముగిసాయి. ఈ నేపథ్యంలో పీసీబీ టిక్కెట్ల ధరను భారీగా తగ్గించినట్టు తెలుస్తుంది. ఈ విషయం బయటకి తెలియడంతో.. పాకిస్థాన్ క్రికెట్ కు ఇంత కంటే అవమానం మరోటి ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి రావల్పిండి వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.
Per Day Ticket Prices for PAK vs BAN Test Series
— STUMPSNBAILS (@stumpnbails) August 13, 2024
.
.
.
.
.#pakistancricket #cricket #BangladeshCricketBoard #cricketer #sports #sportsnews #CricketLegend #pakistancricketteam #stumpsandbails pic.twitter.com/gEiJIJCLkV