వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓటములకు బాధ్యత వహిస్తూ కొందరు స్వతహాగా తప్పుకుంటుంటే, మరొకొందరిని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బలవంతగా తప్పిస్తోంది. ఇప్పటికే సెలెక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్, కెప్టెన్సీకి బాబర్ ఆజాం, బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేయగా.. తాజాగా పీసీబీ జట్టు టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌పై వేటు వేసింది.
మిక్కీ ఆర్థర్‌ను టీమ్ డైరెక్టర్ భాద్యతల నుంచి తొలగించిన పీసీబీ.. అతని స్థానంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ను నియమించింది. ప్రస్తుతం హఫీజ్ టెక్నికల్ కమిటీలో సభ్యునిగా ఉండగా.. అతనికి టీమ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. కాగా, కొద్దిరోజుల క్రితం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హఫీజ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి ఈ పదవి వరించిందనే గుసగుసలు వినపడుతున్నాయి. అలాగే, త్వరలోనే కొత్త కోచింగ్ స్టాప్‌ను పీసీబీ ప్రకటించనుందని సమాచారం.
Former ?? captain Mohammad Hafeez has been given the responsibility of Director - Pakistan Men's Cricket Team.
— Pakistan Cricket (@TheRealPCB) November 15, 2023
The PCB has changed the portfolio of the Pakistan coaching staff. All coaches will continue to work in National Cricket Academy while PCB will announce the new coaching… pic.twitter.com/zwwnsj5lzs
కొత్త కెప్టెన్లు
కాగా, బాబర్ ఆజం స్థానంలో పీసీబీ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టీ20 జట్టుకు పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహీన్ అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, టెస్టు టెస్ట్ పగ్గాలు షాన్ మసూద్‌కు అప్పగించింది. త్వరలోనే(డిసెంబర్) పాకిస్తాన్ జట్టు.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
Presenting our captains ??@shani_official has been appointed Test captain while @iShaheenAfridi will lead the T20I side. pic.twitter.com/wPSebUB60m
— Pakistan Cricket (@TheRealPCB) November 15, 2023