వరల్డ్ కప్ ముంగిట దాయాది పాకిస్తాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. మెగా టోర్నీ ముందు ఆసియా కప్ 2023 ఫైనల్‌కు కూడా అర్హత సాధించకపోవటం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడితే.. ఈ టోర్నీలో పేసర్ నసీం షా గాయపడటం ఆ జట్టుకు మరింత నష్టాన్ని చేకూర్చింది. పోనీ, వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లేముందు వారం రోజుల పాటు దుబాయ్‌లో మకాం వేద్దామన్నా .. అదీ కుదరలేదు.
భారత పర్యటనకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇంకా వీసాలు అందలేదు. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. కాగా, వీసాల కోసం వారం రోజుల క్రితమే వారు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుస్తుగా తీసుకున్న దుబాయ్ ట్రిప్ రద్దు అయింది. అందువల్ల ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, ఇతర సిబ్బంది అందరూ స్వదేశంలోనే ఉండిపోయారు.
Breaking ?
— Green Team (@GreenTeam1992) September 23, 2023
Pakistan ?? are still awaiting visas for their trip to India.
Here are some key points of the issues Pakistan cricket team is facing ahead of the World Cup.#CWC23 | #Cricket | #Pakistan | #GreenTeam | #KhelKaJunoon | #OurGameOurPassion pic.twitter.com/FCuvkqHuxn
నేరుగా హైదరాబాద్
వీసా మంజూరు కాగానే పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 27న దుబాయ్ మీదుగా నేరుగా హైదరాబాద్‌కు రానుంది. అనంతరం సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు తగినంత భద్రతను కల్పించలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా, భారత్, పాక్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు దాదాపు లక్షా 30వేల మంది హాజరుకానున్నారు.
పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టు: ఫఖర్ జమాన్ , ఇమామ్-ఉల్-హక్ , అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, వసీం జూనియర్, హసన్ అలీ.
పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్
- అక్టోబర్ 6: పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్)
- అక్టోబర్ 10: పాకిస్తాన్ vs శ్రీలంక (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్)
- అక్టోబర్ 14: పాకిస్తాన్ vs భారత్ (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
- అక్టోబర్ 20: పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
- అక్టోబర్ 23: పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ (చిదంబరం స్టేడియం, చెన్నై)
- అక్టోబర్ 27: పాకిస్తాన్ vs సౌతాఫ్రికా (చిదంబరం స్టేడియం, చెన్నై)
- అక్టోబర్ 31: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్(ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- నవంబర్ 4: పాకిస్తాన్ vs న్యూజిలాండ్ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
- నవంబర్ 11: పాకిస్తాన్ vs ఇంగ్లండ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)