ఇండియా ఓ శత్రుదేశం.. భారత్‌పై విషం కక్కిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్!

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ పోరు కోసం దాయాది పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం విదితమే. ప్రత్యర్థి జట్టైనా భారత అభిమానులు వారికి ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో వారికి లభించిన ఆదరణ, పార్క్‌ హయత్‌ హోటల్‌ సిబ్బంది వారి పట్ల చూపిన అతిథి మర్యాదలు చూసి వారే ఆశ్చర్యపోయారు. అందుకు పలువురు పాక్ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలపుకున్నారు. 

ఇలా మనదేశంలో పాకిస్తాన్‌ క్రికెట్ బృందానికి అతిథి మర్యాదల్లోఏ లోటు రాకుండా చూసుకుంటుంటే.. ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ జకా అష్రఫ్ మాత్రం భారత్‌పై విషం చిమ్ముతూ కనిపించాడు. మన దేశాన్ని శత్రుదేశంగా వర్ణించాడు. పాకిస్తాన్ టీం శత్రుదేశం(ఇండియా)లో ఉన్నందున చాలా ధైర్యంగా ఉండాలంటూ పిచ్చి కూతలు కూశాడు. అంతేకాదు శత్రుదేశంలో అయినా ఇంకెక్కడైనా టోర్నీ జరుగుతుంటే దేశం మొత్తం వాళ్లకు మద్దతు ఇవ్వాలంటూ ప్రజలలో విషాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెటర్లను, సిబ్బందిని భారతీయులు ఘనంగా స్వాగతిస్తే.. మీరిచ్చే మర్యాద ఇదేనా అని మండిపడుతున్నారు. జకా అష్రాఫ్ వంటి వారి వాళ్లు పాకిస్తాన్ లో ఉండటం వల్లే.. అంతర్జాతీయంగా ఆ దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని బుద్ధి చెప్తున్నారు.