Cricket World Cup 2023: గెలవలేక ఏడుస్తున్నారు: ఇండియన్ ఫ్యాన్స్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్ క్రికెట్ బోర్డ్

Cricket World Cup 2023: గెలవలేక ఏడుస్తున్నారు: ఇండియన్ ఫ్యాన్స్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్ క్రికెట్ బోర్డ్

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాక్ ని చిత్తు చేస్తూ వరల్డ్ కప్ లో వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేశారు. ఈ గెలుపును భారత ఫ్యాన్స్ కి ఎంతగానో కిక్ ఇచ్చింది. లక్ష 32 వేల మంది ప్రేక్షకులున్న అహ్మదాబాద్ స్టేడియంలో సెలెబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్లో సాగాయి. అయితే ఈ సంబరాలు మాత్రం పాక్ కి నచ్చలేదు . దీంతో తమ ఓటమిని తట్టుకోలేని పాక్ క్రికెట్ బోర్డు భారత ఫ్యాన్స్ పై ఐసీసీ కి ఫిర్యాదు చేసింది.

భారత్‌తో మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ప్రేక్షకులు పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని పాక్ క్రికెట్ బోర్డు ICCకి నిన్న (అక్టోబర్ 17) అధికారికంగా ఫిర్యాదు చేయడం షాక్ కి గురి చేస్తుంది. అంతేకాదు పాకిస్థాన్ జర్నలిస్టుల వీసాల ఆలస్యం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. టాస్ సమయంలో బాబర్ పిచ్ ని పరిశీలిస్తున్నప్పుడు ప్రేక్షకులు అతన్ని టార్గెట్ చేశారని, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ స్క్వాడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
 
ఈ మ్యాచ్ తర్వాత పాక్ కోచ్ మిక్కీ ఆర్ధర్ ఇది బీసీసీఐ ఈవెంట్ లా ఉంది. ఐసీసీ ఈవెంట్ లా లేదనే విషయాన్నీ పీసీబీ గుర్తు చేసింది. ఒక క్రికెట్ బోర్డు ఇలా ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం గెలవడం చేతకాక పాక్ క్రికెట్ బోర్డు అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి పాక్ క్రికెట్ బోర్డు చేసిన ఈ ఫిర్యాదు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.