కరాచీ స్టేడియంలో ఇండియా జెండా పెట్టలే..

కరాచీ స్టేడియంలో ఇండియా జెండా పెట్టలే..

కరాచీ: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)  మెగా టోర్నీ ఆరంభానికి ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న దేశాల జెండాలను కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసిన పీసీబీ ఇండియా త్రివర్ణ పతాకాన్ని మాత్రం విస్మరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పీసీబీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

భద్రతా కారణాల వల్ల  ఇండియా ఈ టోర్నీ కోసం పాక్‌‌‌‌కు వెళ్లేందుకు నిరాకరించగా... మన జట్టు మ్యాచ్‌‌‌‌లన్నీ దుబాయ్‌‌‌‌లో షెడ్యూల్‌‌‌‌ చేశారు.  అయితే, పాకిస్తాన్‌‌‌‌లో ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే నేషనల్ స్టేడియంలో ఏర్పాటు చేశామని,  దుబాయ్‌‌‌‌లో ఆడుతున్న కారణంగానే ఇండియా జెండాను పెట్టలేదని పాక్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 

తన వీఐసీ బాక్స్‌‌‌‌ను రూ. 94 లక్షలకు అమ్మేసిన పీసీబీ చైర్మన్‌‌‌‌

దుబాయ్‌‌‌‌లో ఈ నెల 23న ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌ను పీసీబీ చైర్మన్‌‌‌‌ మోసిన్ నఖ్వీ స్టేడియంలోని సాధారణ స్టాండ్స్‌‌‌‌ నుంచి చూడాలని నిర్ణయించుకున్నారు. తనకు కేటాయించిన వీఐసీ బాక్స్‌‌‌‌ను 4 లక్షల దిర్హమ్స్‌‌‌‌ (రూ. 94 లక్షలు)కు విక్రయించారు. ఆ మొత్తానికి పీసీబీ బోర్డు ఖాతాలో వేయాలని నిర్ణయించారు.